మార్చి 14 నిర్వహించే జనసేన ఆవిర్భావ వేడుకలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్టు జనసేన జిల్లా అధ్యక్షులు, కూడా ఛైర్మన్ తుమ్మల రామస్వామి (బాబు) వెల్లడించారు. పెద్దాపురం జనసేన కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పిఠాపురం మండలం చిత్రాడ గ్రామంలోని ఒక లేఅవుట్ లో జనసేన 12వ ఆవిర్భావ వార్షికోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ ఆవిర్భావ సభకు సుమారు పది లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉందని జనసేన అధికారంలో ఉండగా చేసుకుని ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కమిటీలన్నీ సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
