Search
Close this search box.

  NTR 31: “డ్రాగన్” రిలీజ్ ఎప్పుడంటే..? లీక్ చేసిన ప్రొడ్యూసర్..!

జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన సినిమా దేవర.. ఈ సినిమా రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీసు వద్ద సూపర్ హిట్ గా నిలిచింది.. ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ పై కళ్యాణ్ రామ్ నిర్మించారు.. ఈ సినిమాతోనే జాన్వీ కపూర్ తెలుగు ఇండస్ట్రీ కి పరిచయమైంది.. ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద 500కోట్ల వరకు కలెక్ట్ చేసింది.. దీని తరువాత ఎన్టీఆర్ బాలీవుడ్ లో వార్ సీక్వెల్ వార్2 లో హృతిక్ రోషన్ తో కలసి నటిస్తున్నాడు..ప్రస్తుతం వార్2 సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీని తర్వాత ఎన్టీర్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్టు అయినా ఎన్టీఆర్ 31 షూట్ లో జాయిన్ అవుతారు.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ఈ సినిమా రాబోతుంది… ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.. ఈ. సినిమా నుండి ఏ చిన్న న్యూస్ బయటికి వచ్చిన క్షణాల్లో వైరల్ గా మారుతుంది.. ఈ సినిమా టైటిల్ డ్రాగన్ అని అప్పట్లో తెగా వైరల్ గా మారింది.. ఆ తరువాత ఎన్టీఆర్ ఈ సినిమాలో డబల్ రోల్ చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి.. ఈ సినిమా ఈ మధ్యనే షూటింగ్ స్టార్ట్ చేసింది. ప్రశాంత్ నీల్ ఈ సినిమాలో కొన్ని యాక్షన్ బ్లాక్స్ ను రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ చేస్తున్నారు.. వచ్చే నెలలో ఎన్టీఆర్ షూటింగ్ లో జాయిన్ అవుతారు అని సినీ వర్గాల్లో టాక్..ఐతే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ను మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒక నిర్మాత ఎన్టీఆర్, నీల్ సంబంధించిన అప్డేట్ ఇచ్చారు.. ఇప్పుడు ఆ అప్డేట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.. అదేంటంటే ఈ సినిమా రిలీజ్ డేట్ ను నిర్మాత ఒక సినిమా వేడుకలో స్టేజ్ పై లీక్ చేసాడు
.. ఈ సినిమాను 2026 జనవరి 10న సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నట్లు చెప్పారు.. దీంతో ఈ న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు..చూడాలి మరి నీల్ ఎన్టీఆర్ కు ఈ సినిమాలో ఏ రేంజిలో ఎలివేషన్ ఇస్తొడో..

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు