గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ , కైరా అద్వానీ జంటగా ఇటీవలే సంక్రాంతికి రిలీజ్ అయిన గేమ్ చేంజర్ బాక్స్ ఆఫీసు వద్ద డిజాస్టర్ గా నిలిచింది.. మార్విక్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో దాదాపు 450 కోట్ల భారీ బడ్జెట్ తో దిల్ రాజ్ ఈ సినిమాను నిర్మించారు.. ఈ సినిమా పొలిటికల్ డ్రామాగా వచ్చింది.. కానీ శంకర్ మార్క్ ఈ సినిమాలో లేకపోవడంతో ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద ఫ్లాప్ గా నిలిచింది.. దీంతో రామ్ చరణ్ వెంటనే తన నెక్స్ట్ ప్రాజెక్టును వెంటనే స్టార్ట్ చేశాడు.. బుచ్చి బాబు డైరెక్షన్లో రామ్ చరణ్ ఈ సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ కథతో వస్తున్నట్లు సమాచారం.. ఈ సినిమాలో రామ్ చరణ్ మల్లా యోధుడిగా కనబడబోతున్నట్లు సమాచారం.. Rc16 అనే వర్కింగ్ టైటిల్ ఈ సినిమా తెరకెక్కుతుంది.. ఈ సినిమా కోసం రామ్ చరణ్ దాదాపు 25 కిలోల వరకు తన బాడీని పెంచారు.. ప్రస్తుతం 30% వరకు ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది.. ఈ సినిమాలో కీలక పాత్రలో మీర్జాపూర్ స్టార్ మున్నా భాయి నటిస్తున్నాడు.. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ రామ్ చరణ్ బాబాయ్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.. అలాగే హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తుంది.. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా రాబోతుంది.. ఐతే ఈ సినిమా కోసం రామ్ చరణ్ డిల్లీ పార్లమెంట్ కు వెళ్ళబోతున్నట్లు సమాచారం.. పార్లమెంట్ సెట్లో తీసిన సీన్స్ రియలస్టిక్ గా రాకపోవడంతో నిజమైన పార్లమెంట్ లో షూట్ చేయడానికి Rc16 టీం సిద్ధమైనట్లు తెలుస్తుంది.. దీనికి సంబంధించిన పర్మిషన్ కూడా వచ్చిందని. అందుకనే రామ్ చరణ్ ఢిల్లీకి వెళ్లి పార్లమెంటులో షూట్ చేయబోతున్నట్లు సినీ వర్గాల్లో టాక్.. ఈ సినిమాకు “పెద్ది” అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం.. ఈ నెలలో రామ్ చరణ్ బర్త్ డే రోజు టీజర్ రాబోతున్నట్లు సమచారం.. రామ్ చరణ్, బుచ్చి బాబు కాంబో పై అంచనాలు భారీగా ఉన్నాయి..
ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటర్స్ కలిసి భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు.. ఈ సినిమాకు AR రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు..
చూడాలి మరి Rc 16 ఏ రేంజిలో ఉండబోతుంది..
