పెద్దాపురం ఏడిబి రహదారిలో ఉన్న ఫైరింగ్ మెట్ట వద్ద సాయుధ దళాల వార్షిక మొబలైజేషన్ ఫైరింగ్ శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.ఈ శిక్షణా కార్యక్రమంలో జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పాల్గొని ఫైరింగ్ ప్రాక్టీస్ చేశారు.ఈ శిక్షణలో పోలీసులు ఉపయోగించే అత్యాధునిక ఆయుధాలు ఏకె47, ఎస్ఎల్ఆర్,ఎం5 తదితర లాంగ్ రేంజ్ ఆయుధాలు,షార్ట్ రేంజ్ ఆయుధా లైన 9ఎంఎం పిస్టల్ ఫైరింగ్ వినియోగంలో శిక్షణ పొందారు.ఈ కార్యక్రమం లో అదనపు ఎస్ పి భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.
