సామర్లకోట మండలం గొంచాల గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ భద్రాద్రి సీతారామ ఆలయం ప్రతిష్ట పూజలు సోమవారం శాస్తోక్తంగా నిర్వహిం చారు.ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గురు స్వామి వాసుదేవ నేతృత్వంలో విగ్నేశ్వర పూజ,అంకురార్పణ,కలశస్థాపన పూజల అనంతరం సీతారాముల విగ్రహాలను ప్రతిష్టించారు.అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.









