Search
Close this search box.

  SSMB 29: జక్కన్న మాస్టర్ ప్లాన్..? వర్కౌట్ అవుతుందా..?

దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో వస్తున్న సినిమా SSMB 29. SSMB 29 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా రూపొందుతుంది.. బాహుబలి,RRR వంటి బ్లాక్ బస్టర్ సినిమాల తరువాత రాజమౌళి నుండీ సినిమా వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.. ఆ అంచనాలకు తగ్గట్టే ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఈసారి ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో కాకుండా గ్లోబల్ లెవెల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.. ఈ సినిమా కే ఎల్ నారాయణ దాదాపు 1000 కోట్ల బడ్జెట్ నిర్మిస్తున్నట్లు తెలుస్తుంది.. ఈ సినిమా కథపై చాలా రూమర్స్ సోషల్ మీడియాలో వచ్చాయి.. కానీ ఈ సినిమా కథ రచయిత అయినా విజయేంద్ర ప్రసాద్ గారు అప్పట్లో ఒక ఇంటర్వ్యూలో ssmb 29 కథ ఫారెస్ట్ అడ్వెంచర్ అని చెప్పారు.. అలాగే ఈ సినిమా రెండు పార్ట్స్ గా ఉంటుందని చెప్పారు.. దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు అందరూ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఐతే రీసెంట్ గా ఈ సినిమా పూజా కార్యక్రమాలు సీక్రెట్ గా అతి కొద్ది మందితో జరిపారు.. అలాగే ఇప్పుడు షూటింగ్ కూడా రామోజీ ఫిల్మ్ సిటీలో లో సెట్స్ వేసి కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాట్టు సమాచారం.. ఈ సీన్స్ షూట్ చేసిన తరువాత మిగతా షూటింగ్ మొత్తం ఫోరెన్ లో షూట్ చేస్తారట.. ఫోరెన్ షూట్ కు వెళ్ళే ముందు సినిమా గురించి ప్రెస్ మీట్ పెట్టి గురుంచి కొన్ని కీలక విషయాలు వెల్లడిస్తారని సమాచారం.అలాగే సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించే ఛాన్స్ ఉంది అని తెలుస్తుంది.. చూడాలి మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో.. ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక చోప్రా నటిస్తుంది. కొన్ని కీలక సీన్స్ లో హాలీవుడ్ నటులు కూడా ఉండబోతున్నారని తెలుస్తుంది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు