Search
Close this search box.

  రామ్ చరణ్, సందీప్ రెడ్డి వంగా కాంబో సెట్..? మెగా ఫ్యాన్స్ కు పునకాలే..!

దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్.ఆర్.ఆర్ సినిమాతో రామ్ చరణ్ పాన్ ఇండియన్ స్టార్ గా మారిపోయాడు .ఈ సినిమాతో గ్లోబల్ లెవెల్ క్రేజ్ సంపాదించుకున్నారు రామ్ చరణ్.. ఆర్.ఆర్.ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ మార్విక్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో “గేమ్ చేంజర్” అనే సినిమా చేశాడు.. దాదాపు 450 కోట్ల భారీ బడ్జెట్తో ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు. ఈ సినిమా ఇటీవలే సంక్రాంతికి విడుదలై బాక్స్ ఆఫీసు దగ్గర డిజాస్టర్ గా నిలిచింది.. దాంతో రామ్ చరణ్ నెక్స్ట్ పై ఫోకస్ చేశాడు.. రామ్  చరణ్ తన నెక్స్ట్ సినిమాను బుచ్చి బాబు డైరెక్షన్లో చేస్తున్నాడు.. ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్నట్టు సమాచారం. ఐతే రామ్ చరణ్ తన నెక్స్ట్ సినిమాలపై చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. గేమ్ చేంజర్ విషయం లో జరిగిన తప్పులను తన నెక్స్ట్ సినిమాలలో జరగకుండా చూసుకుంటున్నట్లు సమాచారం. అందుకనే రామ్ చరణ్ నుండి రాబోయే సినిమాల లైన్ అప్ సాలిడ్ గా ఉండబోతుంది అని తెలుస్తుంది.. రీసెంట్ అనిమల్ వంటి బ్లాక్ బస్టర్ సినిమా తీసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తుంది.. సందీప్ రెడ్డి రీసెంట్ గా రామ్ చరణ్ కలిసి స్టోరీ లైన్ చెప్పరంటా. సందీప్ చెప్పిన స్టోరీ లైన్ రామ్ చరణ్ కు బాగా నచ్చి వెంటనే ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.. ఐతే సందీప్ రెడ్డి వంగా ప్రభాస్ స్పిరిట్ సినిమాతో బిజీ గా ఉన్నాడు.. దీని తర్వాత అనిమల్ పార్క్ సినిమా చేస్తాడు.. ఆ తరువాత రామ్ చరణ్ సందీప్ రెడ్డి వంగా సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తుంది.. ఒక వేళ ఈ కాంబోలో సినిమా వస్తే ఏ రేంజిలో ఉంటుందో అని అప్పుడే ఫ్యాన్స్ లో ఊహాగానాలు మొదలయ్యాయి..

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు