Search
Close this search box.

  మహిళపై గ్యాంగ్ రేప్..

ఎన్ని కఠిన చట్టాలు వచ్చినప్పటికీ కొందరి కామాంధుల్లో ఎలాంటి మార్పు లేదా చలనం కనిపించడం లేదు. ఆడది కనిపిస్తే చాలు అమాంతం రెచ్చిపోతున్నారు. కామంతో కొట్టుమిట్టాడుతున్నారు. వావి వరసలు మరిచి ఒక మృగంలా ప్రవర్తిస్తున్నారు.అర్థరాత్రి మహిళ ఒంటరిగా తిరిగినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం వస్తుందనే మాటలను పక్కకు పెడితే.. పట్టపగలే మహిళలకు రక్షణ కరువవుతోంది. నమ్మిన వారే మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా గార్డెన్ సిటీ బెంగళూరులో ఇలాంటి దారుణమే చోటు చేసుకుంది.

 

మహిళపై రెచ్చిపోయిన కామాంధులు

బెంగళూరు నగరం కోరమంగళ ప్రాంతంలో గురువారం అర్థరాత్రి దాటి శుక్రవారం తెల్లవారు జామున ఓ మహిళపై నలుగురు కామాంధులు విరుచుకుపడ్డారు. ఆమెపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. నలుగురిలో ఒకరు ముందుగా యువతితో పరిచయం పెంచుకున్నాడు. మహిళకి తను పాత స్నేహితుడినంటూ మాటలు కలిపాడు. గత జ్ఞాపకాలను గుర్తు చేయడంతో ఆ యువతి ఇతన్ని నమ్మింది. అక్కడి నుంచి ఆ యువతిని సరదాగా తాను పనిచేసే ఓ హోటల్‌కు తీసుకెళ్లాడు.

హోటల్ టెరస్ పై..

కాసేపు మాటలు కలిపాక హోటల్ టెరస్ పైకి ఆ మహిళను తీసుకెళ్లాడు. అక్కడ తన మరో ముగ్గురు స్నేహితులు ఉన్నారు. వీరంతా కలిసి ఒక్కసారిగా మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమె దగ్గరున్న విలువైన వస్తువులను దోచుకుని అక్కడి నుంచి పారిపోయారు. తేరుకున్న మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ముగ్గురు అనుమానితులుగా ఉన్న అజిత్, విశ్వాస్, శివులను పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో ఇద్దరిని పశ్చిమ బెంగాల్‌లో పట్టుకోగా మరొకరిని ఉత్తరాఖండ్‌లో అరెస్టు చేశారు. నాలుగో వ్యక్తి పరారీలో ఉన్నాడు.నిందితులంతా బెంగళూరులోని HSR లేఔట్‌లో ఉన్న హోటల్‌లో పనిచేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

 

బాధితురాలి ఆరోగ్య పరిస్థితి

శుక్రవారం ఉదయం 7:30-8 గంటల ప్రాంతంలో తమకు గ్యాంగ్ రేప్‌ పై సమాచారం అందిందని డీసీపీ సారా ఫాతిమా తెలిపారు. మొత్తం నలుగురు కలిసి మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డట్టు చెప్పిన డీసీపీ…బాధితురాలిని మెడికల్ టెస్టులకు పంపించి అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.బాధితురాలు తన ఫ్రెండ్‌ను కలిసేందుకు అక్కడికి వెళ్లినట్లు ప్రాథమిక విచారణ ద్వారా తెలిసిందని… పూర్తిస్థాయి దర్యాప్తులో మిగితా అంశాలు వెలుగులోకి వస్తాయని డీసీపీ ఫాతిమా పేర్కొన్నారు. బాధితురాలు ఢిల్లీ వాసిగా చెప్పిన డీసీపీ ఆమెకు పెళ్లయ్యిందని బెంగళూరులో సెటిల్ అయినట్లు వివరించారు.ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు