Search
Close this search box.

  ఏమీ చేయకపోవడమే ఇష్టం.. ఇదేమి అలవాటు బన్నీ? షాకవుతున్న ఫ్యాన్స్..

కొందరు స్టార్ హీరోలకు ఫ్యాన్‌బేస్ మామూలుగా ఉండదు. వాళ్ల హీరో ఏం చేసినా అదే కరెక్ట్, ఏం మాట్లాడినా అదే కరెక్ట్ అనే మనస్తత్వంతో ఉంటూ ఫ్యాన్ వార్స్ చేసే అభిమానులే ఎక్కువ. అందుకే అలాంటి వారి వల్ల హీరోలపై కూడా అప్పుడప్పుడు నెగిటివిటీ మొదలవుతుంది. ప్రస్తుతం టాలీవుడ్‌లోని స్టార్ హీరోల్లో అల్లు అర్జున్‌కు విపరీతమైన నెగిటివిటీ వచ్చేసింది. తప్పు చేయడం, ఆ తర్వాత ఆ తప్పునే కవర్ చేయాలనుకోవడం.. ఇలాంటి పలు కారణాల వల్ల బన్నీపై కామన్ ఆడియన్స్‌లో ద్వేషం పెరిగిపోయింది. అందుకే అల్లు అర్జన్ జీవితంలో జరిగే ప్రతీ చిన్న విషయం వెంటనే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోతుంది.

 

హాలీవుడ్‌లో ఇంటర్వ్యూ

 

తాజాగా ‘ది హాలీవుడ్ రిపోర్టర్’ అనే మ్యాగజిన్ కవర్ పేజీపై అల్లు అర్జున్ ఫోటో రావడంతో ప్రేక్షకులంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అసలు బన్నీ రేంజ్ టాలీవుడ్ నుండి హాలీవుడ్ వరకు పెరిగిపోయిందని తన ఫ్యాన్స్ మాత్రం చాలా హ్యాపీగా ఫీలయ్యారు. ‘ది హాలీవుడ్ రిపోర్టర్’ మ్యాగజిన్ కవర్‌కు తాను ఫోటోషూట్ చేయడంతో పాటు వారికి ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు బన్నీ. ఆ ఇంటర్వ్యూకు సంబంధించిన గ్లింప్స్ లీక్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్ కూడా అవుతోంది. ఈరోజుల్లో అల్లు అర్జున్ ఏం మాట్లాడినా దానిపై ప్రేక్షకుల ఫోకస్ పెరగడంతో అసలు హాలీవుడ్ మీడియాతో తను ఏం మాట్లాడి ఉంటాడు, ఇంటర్వ్యూ ఎలా జరిగుంటుంది అని అందరిలో ఆసక్తి పెరిగిపోయింది.

 

ఏమీ చేయను

 

అసలు షూటింగ్ లేనప్పుడు తను ఏం చేస్తాడు అనే ప్రశ్న బన్నీకి ఎదురయ్యింది. దానికి సమాధానంగా ఏం చేయను అని చెప్పాడు అల్లు అర్జున్. ‘‘నేను పని లేకపోతే అస్సలు ఏం చేయను. అసలు ఒక పుస్తకం కూడా చదవను. ఏమీ చేయను కూడా. ఏం చేయకుండా ఉండడమే నాకు ఇష్టం’’ అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చాడు అల్లు అర్జున్. మామూలుగా హీరోలు సినిమా షూటింగ్ లేకపోయినా కూడా ఏదో ఒక పని చేస్తూ ఉంటారు. కొందరు జిమ్‌లో ఎక్కువ సమయాన్ని గడపడానికి ఇష్టపడతారు, కొందరు సినిమాలు, పుస్తకాలతో కాలక్షేపం చేస్తారు. కానీ అల్లు అర్జున్ మాత్రం ఖాళీగా ఉంటే కనీసం పుస్తకం కూడా చదవను అనడంతో ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.

 

అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్

 

ప్రస్తుతం అల్లు అర్జున్ (Allu Arjun).. ‘పుష్ప 2’ ఇచ్చిన సక్సెస్‌తో పాన్ ఇండియా స్టార్ అనే ట్యాగ్‌ను సొంతం చేసుకున్నాడు. అసలు ఈ సినిమా విడుదల అయినప్పటి నుండి యావరేజ్ టాకే అందుకున్నా కూడా కలెక్షన్స్ విషయంలో మాత్రం దేశవ్యాప్తంగా దూసుకుపోయి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ మూవీ సక్సెస్ బన్నీ ఇండస్ట్రీలో మరో ముందడుగు వేసేలా చేసింది. ఇక పుష్ప ఫ్రాంచైజ్ తర్వాత అసలు అల్లు అర్జున్ ఎవరితో సినిమా చేస్తాడు అనే సస్పెన్స్‌కు కూడా తెరపడింది. తనతో మూడుసార్లు కలిసి పనిచేసి మూడు హిట్లు అందించిన త్రివిక్రమ్ శ్రీనివాస్‌తోనే తన అప్‌కమింగ్ మూవీని ఓకే చేశాడు బన్నీ. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై కూడా ఫ్యాన్స్‌లో అంచనాలు భారీగానే ఉన్నాయి.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు