Search
Close this search box.

  నాని విశ్వరూపానికి ముహూర్తం ఫిక్స్.. ‘హిట్ 3’ టీజర్..

హీరోలంతా తమకు సక్సెస్ ఇచ్చిన స్టోరీలతోనే ఎక్కువగా ప్రేక్షకుల ముందుకు రావడానికి ప్రయత్నిస్తుంటారు. అదే పెద్దగా రిస్క్ లేని పని అనుకుంటారు. కానీ గత కొన్నేళ్లలో స్టార్ హీరోల ఆలోచనా విధానం కూడా మారింది. కొత్తగా ప్రయోగాలు చేస్తేనే ప్రేక్షకులు ఇష్టపడతారు అని వారు కూడా అనుకోవడం మొదలుపెట్టారు. అందుకే చాలావరకు హీరోలు ప్రతీ సినిమాకు తమ పద్ధతులను మార్చుకుంటూ ముందుకెళ్తున్నారు. అందులో నేచురల్ స్టార్ నాని కూడా ఒకడు. నాని మునుపెన్నడూ చేయని పాత్రతో వస్తున్న సినిమానే ‘హిట్ 3’. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర అప్డేట్ బయటికొచ్చింది.

 

ఎన్నో మార్పులు

 

ఇప్పటివరకు నాని ఎన్నో పక్కింటబ్బాయి పాత్రలు చేశాడు. మిడిల్ క్లాస్ ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే క్యారెక్టర్స్‌లోనే కనిపించాడు. అవన్నీ పక్కన పెట్టి మొదటిసారి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ‘దసరా’లో కాస్త రక్తపాతం చూపించాడు. అంతకు ముందు వరకు నాని వైలెన్స్‌కు చాలా దూరం. ఇప్పుడు ‘దసరా’కు మించి వైలెన్స్ చూపించడానికి వచ్చేస్తున్నాడు. తన కెరీర్‌లో మొదటిసారిగా ఒక పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘హిట్ 3’ కోసం తనను తాను పూర్తిగా మార్చుకున్నాడు నాని. తనలోని ఈ వైలెంట్ కోణాన్ని చూడడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉండగా.. దీని టీజర్ విడుదల చేస్తున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు.

 

హిట్‌వర్స్ కోసం

 

యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను (Sailesh Kolanu) హీరోలను పోలీసులుగా చూపిస్తూ.. హిట్‌వర్స్ అనే యూనివర్స్‌ను క్రియేట్ చేశాడు. అందులో తన హీరోలను మరీ వైలెంట్‌గా చూపిస్తూ యూత్ ఆడియన్స్‌ను విపరీతంగా అట్రాక్ట్ చేశాడు. అలా ఇప్పటివరకు తన హిట్‌వర్స్‌లో విశ్వక్ సేన్, అడవి శేష్ వంటి యంగ్ హీరోలు పోలీసులుగా నటించారు. అదే యూనివర్స్‌లో నాని కూడా యాడ్ అయ్యాడు. శైలేష్ కొలను చివరిగా డైరెక్ట్ చేసిన ‘హిట్ 2’ క్లైమాక్స్‌లో విక్రమ్ సర్కార్ అనే పోలీస్ పాత్రలో నాని (Nani) కనిపించాడు. ఆ లుక్‌తో అసలు ‘హిట్ 3’ ఎలా ఉంటుందో అందరికీ ఒక ఐడియా వచ్చేలా చేశాడు నాని. ఇప్పుడు పూర్తిగా టీజర్‌తో తానేంటో చూపించనున్నాడు.

 

వైలెంట్ పోస్టర్

 

ఫిబ్రవరి 24న ‘హిట్ 3’ (Hit 3) టీజర్ రిలీజ్ అవుతుందని నాని తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఈ మూవీ మే 1న విడుదల అవుతుందని కూడా మరోసారి క్లారిటీ ఇచ్చాడు. వాల్ పోస్టర్ సినిమాతో పాటు యూనానిమస్ ప్రొడక్షన్స్ కలిపి ‘హిట్ 3’ను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. టీజర్ అనౌన్స్‌మెంట్ కోసం విడుదల చేసిన పోస్టర్‌లో కూడా నాని ఫుల్ వైలెంట్ లుక్‌లో కనిపించాడు. ఇందులో తన ఫేస్ రివీల్ చేయకపోయినా కూడా చాలామందిని గొడ్డలితో నరికి రక్తపాతం సృష్టించినట్టుగా చూపించారు. దీంతో నాని కెరీర్‌లో ఇది గుర్తుండిపోయే సినిమా అవుతుందని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. టీజర్ కోసం అప్పుడే ఎదురుచూపులు మొదలయ్యాయి.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు