Search
Close this search box.

  మాస్టర్ అథ్లెటిక్ నాగబాబుకు ఎమ్మెల్యే అభినందన

మాస్టర్ అథ్లెటిక్ నాగబాబుకు ఎమ్మెల్యే అభినందన.
February 12, 2025 8:12 PM | Aditya369 News

మాస్టర్ అథ్లెటిక్ నాగబాబుకు ఎమ్మెల్యే అభినందన

సామ‌ర్ల‌కోట‌కు చెందిన మాస్టర్ అథ్లెటిక్ యాతం నాగబాబు ను పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన రాజప్ప అభినందించారు. ఈనెల 6వ తేదీ నుండి 8వ తేది వరకు రాజస్థాన్ ఆళవార్ మహానగరం రాజర్షి కాలేజీ స్టేడియంలో జరిగిన 44వ నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఓపెన్ ఛాంపియన్‌ షిప్ మీట్ లో పాల్గొన్నాడు. నాగబాబు 100,200,400,800 మీటర్స్ విభాగాల‌లో కాంస్యం ప‌త‌కాలు, 4×400 మీటర్లు రిలే పందెంలో  బంగారు పతకం, 4×100 మీటర్లు రిలే పరుగు పందెం నందు వెండి పతకముతో క‌లిపి మొత్తం 6 విభాగాల్లో ప‌త‌కాలు సాధించారు. నాగబాబు కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో జిల్లా మలేరియా విభాగంనందు సబ్ యూనిట్ అధికారిగా ప‌నిచేస్తున్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore