కూటమి ప్రభుత్వం ఏర్పడి 9నెలలు అవ్వుతోందని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అన్నారు.ప్రభుత్వం ఏర్పడినప్పుడల్లా ఏదో ఒక సవాల్ ఉండేదని కానీ ఇన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారని గత ఐదేళ్లలో గాడి తప్పిన పాలనను తాము 8 నెలల్లో గాడిలో పెట్టే ప్రయత్నం చేశామన్నారు.సంపద సృష్టించి పేదలకు పంచలంటే సమర్థ నాయకత్వంతోనే సాధ్య మని స్పష్టం చేశారు.









