తిరుపతి జనసేన పార్టీ ఇంచార్జి కిరణ్ రాయల్ పై ఆరోపణలు చేసిన లక్ష్మిరెడ్డిని చీటింగ్ కేసులో అదుపులోకి తీసుకున్న పోలీసులు వైద్య
పరీక్షల అనంతరం ఆమెను తిరుపతి కోర్టు లో హాజరు పర్చారు.ఆమెపై ట్రాన్సిస్ట్ అరెస్టు వారెంట్ ఉండడంతో జైపూర్ పోలీసులకు అప్పగించాలని జడ్జి ఆదేశాలు జారీ చేశారు.లక్ష్మికి ప్రాణహాని ఉందని కుటుంబ సభ్యులు తెలపడంతో వారిని తోడుగా తీసుకెళ్లేందుకు కోర్టు అనుమతిచ్చింది.ఆమె ను చెన్నై మీదుగా జైపూర్ తీసుకెళ్ళనున్నారు.









