శ్రీశైలం బ్రహ్మోత్సవాలు ఈనెల 19 నుంచి మార్చి 1వ తేదీ వరకు ఘనంగా జరగనున్నాయి.ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫిబ్రవరి 23న శ్రీశైలం స్వామి, అమ్మవార్లకు రాష్ట్ర ప్రభుత్వం తర పున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.ఏర్పాట్లను పరిశీ లించేందుకు రాష్ట్ర మంత్రుల బృందం వెళ్లనుంది.ఆథ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దేం దుకు విదేశీ యాత్రికులను సైతం ఆకట్టుకునేలా అంతర్జా తీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది.









