కాకినాడలో నార్వేకు చెందిన క్రౌన్ ఎల్ ఎన్ జి సంస్థ రాబోయే సంవత్సరాల్లో 1.2 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడులతో ప్రాజెక్టును చేపట్టబోతున్నట్లు వెల్లడించింది.కాకినాడ తీరానికి 11 కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో భారత్ లో మొట్టమొదటి గ్రావిటీ బేస్డ్ స్టోరేజ్ & రీగ్యాసిఫికేషన్ యూనిట్ ను నెలకొల్పబోతున్నట్లు ప్రకటించింది.దాంతో 7.2 మిలియన్ టన్నుల రీ గ్యాసిఫికేషన్ సామర్థ్యంతో టెర్మినల్ అందుబాటులోకి రానుంది.









