రైల్వేలకు కేటాయింపులతో కూడిన యూనియన్ బడ్జెట్‌ను 01 ఫిబ్రవరి 2025 న పార్లమెంట్లో సమర్పించారు. ఈ సందర్భంగా కేంద్ర రైల్వే, సమాచార & ప్రసార శాఖ, ఎలక్ట్రానిక్స్ ,ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్, న్యూఢిల్లీ నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన కేటాయింపుల ముఖ్యాంశాలపై మీడియా సమావేశం నిర్వహించారు.సికింద్రాబాద్ , హైదరాబాద్, విజయవాడ, గుంతకల్లు, గుంటూరు మరియు, నాందేడ్ డివిజన్లకు సంబంధించిన డివిజనల్ రైల్వే మేనేజర్లు తమ డివిజనల్ హెడ్ క్వార్టర్స్ నుండి వీడియో లింక్ ద్వారా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ 2025-2026 సంవత్సరానికిగాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రికార్డు స్థాయిలో రూ. 9,417 కోట్ల బడ్జెట్ కేటాయింపులు మంజూరు అయ్యాయని తెలియజేశారు. 2009-14 సంవత్సరాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వార్షిక సగటు బడ్జెట్ వ్యయం రూ . 886 కోట్లు మాత్రమే అని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బడ్జెట్ కేటాయింపులు ఉమ్మడి రాష్ట్రానికి 2009-14 మధ్య కాలంలో జరిగిన సగటు కేటాయింపులతో పోలిస్తే 11 రెట్లు పెరిగిందని తెలియజేశారు.
గౌరవ మంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ రైలు అభివృద్ధి ప్రాజెక్టుల కోసం రూ. 84,559 పెట్టుబడి పెడుతున్నట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే నెట్వర్క్ ఇప్పుడు 100% విద్యుదీకరణ చెందిందని మంత్రి తెలియజేశారు. కవచ్ ఏర్పాటులో దక్షిణ మధ్య రైల్వే ముందంజలో ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం , దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని వివిధ విభాగాలలో 1,465 కిలోమీటర్ల మేర కవచ్ ఏర్పాటుచేయబడిందని మరియు కవచ్ తాజా వెర్షన్ 4.0 ఏర్పాటుకు ట్రయల్స్ జరుగుతున్నాయని ఆయన అన్నారు.
రాబోయే 6 సంవత్సరాలలో దేశవ్యాప్తంగా మొత్తం రైలు నెట్‌వర్క్‌లో కవచ్‌ను ఏర్పాటుచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలిపారు. గత 10 సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1,560 కిలోమీటర్ల కొత్త రైల్వే ట్రాక్ నిర్మించబడిందని, ఇది శ్రీలంక మొత్తం రైల్వే నెట్వర్క్ కంటే ఎక్కువ అని ఆయన తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 15 జిల్లాలను కవర్ చేస్తూ 21 స్టాప్‌లతో 8 వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయని అశ్విని వైష్ణవ్ తెలిపారు. మాల్డా టౌన్ – బెంగళూరు మధ్య నడుస్తున్న అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 14 స్టాప్‌లు ఉన్నాయని ఆయన అన్నారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 73 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధిని చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.
50 కొత్త నమో భారత్ రైళ్లు, 200 వందే భారత్ రైళ్లు ,100 కొత్త అమృత్ భారత్ రైళ్లకు ఆమోదం లభించిందని, ఈ రైళ్ల రాకపోకలను ఎప్పటికప్పుడు ప్రకటిస్తామని ఆయన ప్రకటించారు. రైల్వేలు 7,000 కిలోమీటర్ల పాత ట్రాక్‌లను పునరుద్ధరించాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నాయని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
ముఖ్యమైన విభాగాలలో 160 కిలోమీటర్ల వేగంతో రైళ్లను నడపడానికి భారతీయ రైల్వేలు రైల్వే ట్రాక్‌లను అప్‌గ్రేడ్ చేయాలని యోచిస్తున్నాయని తెలిపారు. అదేవిధంగా, కొన్ని మార్గాలు 130 కిలోమీటర్ల వేగంతో రైళ్లను నడపగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని మరియు మొత్తం నెట్వర్క్ 100 కిలోమీటర్ల వేగంతో రైళ్లను నడపగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని పేర్కొన్నారు.









