Search
Close this search box.

  బాలకృష్ణ-బోయపాటి అఖండ-2లో సన్యాసినిగా ఒక్కప్పటి స్టార్ హీరోయిన్..?

January 20, 2025 12:03 PM | Aditya369 News

బాలకృష్ణ-బోయపాటి అఖండ-2లో సన్యాసినిగా ఒక్కప్పటి స్టార్ హీరోయిన్..?

నటసింహం నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన అఖండ చిత్రం అద్భుత విజయాన్ని సాధించిన నేపథ్యంలో అఖండ 2 – తాండవపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు ఇప్పటికే పూర్తి చేసుకోగా, రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభమయింది. అది కూడా మహా కుంభ మేళాలో ప్రారంభం కావడం గమనార్హం.

షూటింగ్ గురించి బోయపాటి మాట్లాడుతూ.. అఘోర పాత్రలతో కూడిన సినిమా కావడంతో ఈ కుంభమేళాలో కోట్ల మంది భక్తులు, లక్షల మంది అఘోరాలు, నాగ సాధువుల మధ్య షూటింగ్ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా అఘోరాలు, నాగ సాధువులను కలిశామన్నారు. కోట్ల మంది జనాల మధ్య మూవీ చిత్రీకరణ అంటే సాధారణ విషయం కాదని, ఇది చిత్ర యూనిట్‌కు ఒక ఛాలెంజ్ అనే చెప్పాలన్నారు.

కాగా, ఈ తాజా సినిమాలో మరో సీనియర్ హీరోయిన్ నటించనుందని తెలుస్తోంది. ఒకప్పటి హీరోయిన్ శోభన ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తుందని.. ఆమె పాత్ర ఓ సన్యాసిని అని టాక్ నడుస్తోంది. అంతే కాదు ఈ సినిమాలో శోభన పాత్రలో చాలా వేరియేషన్స్ కూడా ఉంటాయని సమాచారం. ఇప్పటికే పలు కీలక పాత్రల్లో ఇతర భాషల నటులను తీసుకోవాలని మూవీ మేకర్స్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు