కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్ లో ఉన్న పంచవటి లాడ్జిలో ఓ యువకుడు పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతిచెందిన యువకుడు అనకాపల్లి జిల్లా మాకవారిపాలెం మండలం బురుగుపాలెం గ్రామానికి చెందిన గునురు భరత్ (23) గా పోలీసులు గుర్తించారు. పిఠాపురం సీఐ శ్రీనివాస్, ఎస్సై మణికుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు









