Search
Close this search box.

  కేంద్ర బడ్జెట్‌పై ఈసీ కీలక ఆదేశాలు..!

January 7, 2025 8:00 PM | Aditya369 News

కేంద్ర బడ్జెట్‌పై ఈసీ కీలక ఆదేశాలు..!

ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. అన్ని పార్టీలు ఎన్నికల సమరానికి సమాయాత్తమౌతోన్నాయి. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. కాంగ్రెస్ కూడా సొంతంగా బరిలో దిగిన త్రిముఖ పోటీ ఏర్పడటం ఖాయమౌతుంది.

ఊహించినట్టే ఫిబ్రవరి మొదటివారంలో ఈ ఎన్నికలు షెడ్యూల్ అయ్యాయి. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈ మేరకు ఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లోని ప్లానెరీ హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్, కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, డాక్టర్ సుఖ్‌బీర్ సింగ్ సంధుతో కలిసి మాట్లాడారు.

ఫిబ్రవరి 5వ తేదీన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. అదే నెల 8వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. ఈ నెల 10వ తేదీన గెజిట్ నోటిఫికేషన్ వెలువడుతుంది. ఆ రోజు నుంచి నామనేషన్లను దాఖలు చేయవచ్చు. అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేయడానికి చివరి తేదీ ఈ నెల 17. 18వ తేదీన వాటిని స్క్రూటినీ చేస్తారు.

నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి ఈ నెల 20వ తేదీ వరకు గడువు ఉంటుంది. ఫిబ్రవరి 5వ తేదీన బుధవారం నాడు ఒకే దశలో పోలింగ్‌ జరుగుతుంది. 8వ తేదీన శనివారం నాడు ఓట్లను లెక్కిస్తారు. 10వ తేదీ నాటికి ఈ ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తవుతుంది. ఈ షెడ్యూల్ విడుదలతో ఢిల్లీలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చినట్టయింది.

ఢిల్లీ పోలింగ్‌కు నాలుగు రోజుల ముందు కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనలు పార్లమెంట్‌లో టేబుల్ కానున్నాయి. ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. దీనికి సంబంధించిన కసరత్తు తుదిదశకు చేరుకుంది. ఇందులో భాగంగా దాదాపు అన్ని రంగాలకు చెందిన ప్రముఖులతో ఆమె వరుస భేటీలను సైతం నిర్వహించారు.

ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చిన ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనలు పార్లమెంట్ సమక్షానికి రాబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఒక వంక కోడ్ ఆఫ్ కండక్ట్, మరోవంక బడ్జెట్ ఉండటం వల్ల కేంద్ర ప్రభుత్వం దీన్ని అడ్వాంటేజ్‌గా తీసుకోవచ్చనే అనుమానాలు తలెత్తాయి.

ఈ నేపథ్యంలో ఈసీ రాజీవ్ కుమార్.. కీలక ప్రకటన చేశారు. కేంద్ర బడ్జెట్‌లో ఢిల్లీ అసెంబ్లీ పరిధి వరకు ఎలాంటి కేటాయింపులు ప్రకటించకూడదని అన్నారు. ఇది ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందికి వస్తుందని చెప్పారు. అందుకే- నేడే కేంద్ర మంత్రివర్గ కార్యదర్శికి లేఖ రాస్తామని చెప్పారు.

మిగిలిన రాష్ట్రాలకు కేంద్రం ఎలాంటి పథకాలు, కేటాయింపులనైనా ప్రకటించుకోవచ్చని, ఢిల్లీ అసెంబ్లీ పరిధిని మాత్రం మినహాయించాల్సి ఉంటుందని రాజీవ్ కుమార్ తేల్చి చెప్పారు. ఈ మేరకు కేంద్ర కేబినెట్ కార్యదర్శికి నేడే లేఖ రాస్తామనీ అన్నారు. ప్రత్యేకంగా ఢిల్లీపై ఎలాంటి వరాలను ప్రకటించకూడదని స్పష్టం చేశారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు