Search
Close this search box.

  ఉమెన్స్ కాలేజీ హాస్టల్‌లోని బాత్‌రూంలో కెమెరాలు.. విద్యార్థినులు పెద్ద ఎత్తున ఆందోళనలు..

మేడ్చల్ జిల్లాలోని కండ్లకోయ సీఎంఆర్ ఉమెన్స్ కాలేజీ హాస్టల్‌లోని బాత్‌రూంలో కెమెరాలు పెట్టి వీడియోలు తీశారని బుధవారం రాత్రి విద్యార్థినులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఘటనను సుమోటోగా స్వీకరించింది తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్.

 

వెంటనే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని హైదరాబాద్ సీపీని మహిళా కమిషన్ ఆదేశించింది. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇప్పటికే ఐదుగురు అనుమానితులను అదుపులోకి విచారిస్తున్నారు. వారి సెల్ ఫోన్లను పరిశీలిస్తున్నారు. కాగా, నిందితులు వీడియోలు చిత్రీకరిస్తున్న సమయంలో కిటీకీలపై కొన్ని చేతి ముద్రలు ఉండడాన్ని గమనించిన విద్యార్థినులు ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు.

 

ఈ విషయంపై మేడ్చల్ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని తెలిపారు. విద్యార్థినుల వసతి గృహాలను పరిశీలించిన వారు కొన్ని గదులు సిబ్బందికి అనుసంధానం చేసి ఉన్నాయని తెలిపారు. అలా ఉండటం వల్ల వీడియోలు తీయడానికి ఆస్కారం ఉందన్నారు.

 

బాత్రూంల వెంటిలేటర్లు ఇతర గదులకు అనుసంధానం చేసి ఉన్నాయని ఏసీపీ తెలిపారు. అనుమానితుల నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లలో వీడియోలు తీశారా?, డిలీట్చేశారా? లేదా అన్నదానికి కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్ద్వారా తెలుసుకుంటున్నామని చెప్పారు. ఒకవేళ రుజువైతే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.

 

ఇది ఇలావుండగా, నిందితుల దగ్గర ఇందుకు సంబంధించిన 300 ప్రైవేట్ వీడియోలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. అంతేగాక, ఈ విషయాన్ని కాలేజీ యాజమాన్యం గోప్యంగా ఉంచినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సదరు వీడియోలతో విద్యార్థినులను బ్లాక్ మెయిల్ చేసి విషయం బయటకు రాకుండా చూసినట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ ఏబీవీపీ డిమాండ్ చేస్తోంది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు