Search
Close this search box.

  టాటా ట్రస్ట్ ఛైర్మన్‌గా నోయల్‌కే ఆ బాధ్యతలు..! ఎవరు ఈ నోయల్ టాటా..?

వ్యాపార దిగ్గజం రతన్ టాటా కన్నుమూయగా.. టాటా గ్రూప్ కంపెనీ ఇక భాద్యతలు అప్పగించే పనిలో నిమగ్నమైంది. ఈ నేపథ్యంలో ముందుగా టాటా ట్రస్ట్ ఛైర్మన్ ను ఎన్నుకోవాలని ట్రస్ట్ సభ్యులు భావించారు. అయితే ఈ పదవికి అన్ని అర్హతలు ఉన్న వ్యాపారవేత్తగా.. నోయల్ టాటాను గుర్తించిన ట్రస్ట్ బోర్డు సభ్యులు.. ఏకగ్రీవంగా ఛైర్మన్ గా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. కాగా నోయెల్ టాటా, టాటా ట్రస్ట్‌కి చెందిన స్థాపకుల కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆయన గతంలో టాటా టెలీసర్వీసెస్, టాటా టేలిఫోన్, మరియు టాటా స్టీల్ వంటి ప్రముఖ సంస్థలలో కీలక పదవులతో సంస్థ అభివృద్దికి పాటుబడ్డారు.

 

నోయెల్ టాటా అధ్యక్షత్వంలో, టాటా ట్రస్ట్ సాంఘిక సేవలలో మరింత ప్రగతి సాధించాలనే లక్ష్యంతో వివిధ పథకాలను అమలు చేయనుంది. ఈ నియామకం ద్వారా, టాటా ట్రస్ట్ మున్ముందు మరింత సామాజిక బాధ్యతలు తీసుకునే దిశగా అడుగులు వేయనుంది. నోయెల్ టాటా తనకు ఇచ్చిన ఈ కొత్త బాధ్యతను స్వీకరించినందుకు కృతజ్ఞతలు తెలిపి, టాటా ట్రస్ట్ మార్గదర్శనంలో సానుకూల మార్పులను తీసుకురావడానికి తన సహయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. టాటా ట్రస్ట్ ప్రణాళికలను అమలు చేయడం ద్వారా, దేశంలో ఉన్న వివిధ సామాజిక సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తుందని నోయెల్ టాటా చెప్పారు.

 

ఎవరు ఈ నోయల్ టాటా..

టాటా సన్స్‌ మాజీ ఛైర్మన్‌ దివంగత సైరస్‌ మిస్త్రీ సోదరి పల్లోంజి మిస్త్రీ.. కాగా ఈమె కుమార్తె ఆలూ మిస్త్రీని వివాహం చేసుకున్నారు నోయల్‌. పల్లోంజి మిస్త్రీ గ్రూపునకు టాటా గ్రూపులో 18.4% వాటా ఉన్న నేపథ్యంలో… నోయల్‌ టాటా ట్రస్ట్స్‌ ఛైర్మన్‌ అయ్యారని సమాచారం. నోయల్, ఆలూకు ముగ్గురు పిల్లలు సంతానం కాగా.. వారి పేర్లు లేహ, నెవిల్లె, మాయా. వీరు కూడా టాటా గ్రూప్‌లో వివిధ పదవుల్లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

 

టాటా గ్రూప్‌ హోల్డింగ్‌ కంపెనీలలో టాటా ట్రస్ట్స్‌కే అత్యధికంగా 66 శాతం వాటా ఉంది. అందువల్ల టాటా టస్ట్ర్స్‌కు ఛైర్మన్‌ హోదాలో ఉన్న వ్యక్తి.. గ్రూపు కంపెనీల కార్యకలాపాలు, వృద్ధి నిర్ణయాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తారు. ఇప్పటి వరకు టాటా ట్రస్ట్స్‌ ఛైర్మన్‌గా రతన్‌ టాటా ఉండేవారు. ఆయన మరణించడంతో టాటా ట్రస్ట్స్‌ ఛైర్మన్‌ పదవి ఖాళీ కాగా.. నోయల్ ఆ భాద్యతలను చేపట్టారు.

 

నోయల్‌ ట్రెంట్, వోల్టాస్, టాటా ఇన్వెస్ట్‌మెంట్‌ కార్పొరేషన్, టాటా ఇంటర్నేషనల్‌ కంపెనీలకు ఛైర్మన్‌గా ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. టాటా స్టీల్, టైటాన్‌కు వైస్‌ ఛైర్మన్‌గానూ కొనసాగుతున్నారు. శ్రీ రతన్‌ టాటా ట్రస్ట్‌ బోర్డులోనూ నోయల్‌ సభ్యుడిగా కొనసాగుతుండగా.. ఇవన్నీ టాటా ట్రస్ట్స్‌ ఛైర్మన్‌ అయ్యేందుకు నోయల్‌కు అనుకూలించాయని చెప్పవచ్చు. అయితే ఇప్పటివరకు ట్రస్ట్ సేవలు యావత్ భారత్ వ్యాప్తి చెందగా.. మున్ముందు కూడా అదే తరహాలో ట్రస్ట్ సేవలు మరింత విస్తృతంగా అందుతాయని ట్రస్ట్ సభ్యులు తెలిపారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు