Search
Close this search box.

  పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళపై దివ్వల మాధురి షాకింగ్ కామెంట్స్..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దువ్వాడ శ్రీనివాస్,దివ్వల మాధురి వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఇటీవల కూడా తిరుమలలో దువ్వాడ శ్రీనివాస్, దివ్వల మాధురి కలిసి హడావిడి చేయడంతో ప్రస్తుతం వీరిపై మళ్ళీ తెలుగు రాష్ట్రాలలో చర్చ జరుగుతుంది. ఇక ఇదే సమయంలో ఓ మీడియా ఛానల్ లో మాట్లాడిన దివ్వల మాధురి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన వ్యాఖ్యలు చేయడం పవన్ కళ్యాణ్ అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తుంది.

 

పవన్ కళ్యాణ్ రాజీనామా చెయ్యాలన్న దివ్వల మాధురి

ఓ ఛానల్ ఇంటర్వ్యూలో దివ్వల మాధురి వ్యక్తిగత జీవితానికి రాజకీయాలకు సంబంధం లేదని వ్యాఖ్యలు చేశారు.. అయితే రాజకీయ జీవితంలో ఉన్న వ్యక్తుల వ్యక్తిగత జీవితంతో, ప్రజలకు సంబంధం ఉంటుందని, యాంకర్ చూసిన వ్యాఖ్యలకు దివ్వల మాదిరి పవన్ కళ్యాణ్ ప్రస్తావన తెచ్చి పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేశారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ రాజీనామా చేయాలని, ఆయన మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు అంటూ వ్యాఖ్యానించారు.

 

పవన్ ఫ్యాన్స్ కు దివ్వెల మాధురి సలహా

వ్యక్తిగత జీవితంలో ఎటువంటి మచ్చ లేని వాళ్ళు రాజకీయాలు చేయాలంటే ఆ శ్రీరామ చంద్రుడు తప్ప మరెవరు చేయలేరని వ్యాఖ్యలు చేసిన దివ్వెల మాధురి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తనను తెగ ట్రోల్ చేస్తున్నారని వ్యాఖ్యానిస్తూ ముందు పవన్ కళ్యాణ్ తో రాజీనామా చేయించండి అంటూ సలహా ఇచ్చారు . ఇక దివ్వల మాధురి చేసిన వ్యాఖ్యల పైన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు.

 

దివ్వల మాధురి చేసిన డిమాండ్ పైన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆగ్రహం

డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ ముగ్గురిని పెళ్లి చేసుకున్న కారణంగా రాజీనామా చేయాలని దివ్వల మాధురి చేసిన డిమాండ్ పైన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దివ్వల మాధురి ఏ విషయమైతే చెప్పిందో అదే విషయాన్ని మళ్ళీ ఆమెకు చెబుతూ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాలను రాజకీయాలకు ఆపాదించవద్దని సూచించారు.

 

పవన్ ప్రస్తావన దేనికి?

మీ వివాదాన్ని పరిష్కరించుకోకుండా పవన్ ప్రస్తావన ఎందుకంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గురించి వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమని హెచ్చరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ముగ్గురిని వివాహం చేసుకున్నా లీగల్ గా విడాకులు అయిన తర్వాతనే వివాహం చేసుకున్నాడని అన్నారు.

 

ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలన్న పవన్ ఫ్యాన్స్

అంతేకాదు పవన్ కళ్యాణ్ విషయంలో ఎవరూ దువ్వాడ శ్రీనివాస్ సతీమణి వాణిలాగా రోడ్డెక్కి రచ్చ చేయలేదని, నీలాగా డ్రామాలు ఆడలేదని మాధురి పైన ఘాటుగా స్పందిస్తున్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిదని హితవు చెబుతున్నారు. ఇంకోసారి మాట్లాడితే సహించేది లేదని దివ్వల మాధురిని హెచ్చరిస్తున్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు