Search
Close this search box.

  మోడీ దసరా కానుక-ఏపీకి రూ. 7211 కోట్లు, తెలంగాణకు రూ.3745 కోట్లు..!

తెలుగు రాష్ట్రాలకు ప్రధాని మోడీ దసరా కానుక ఇచ్చారు. దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాలకు కూడా పన్నుల వాటాను విడుదల చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం ఏపీ, తెలంగాణ తమకు పన్నుల్లో రావాల్సిన వాటాను అందుకోబోతున్నాయి. అసలే నిధుల కొరతతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాలకు ఇది పండుగ వేళ కేంద్రం శుభవార్తగా భావిస్తున్నారు. ఈ మేరకు కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.

 

ఏడాది పొడవునా వసూలయ్యే పన్నుల్లో రాష్ట్రాలకు కేంద్రం నిబంధనల ప్రకారం తమ వాటాను ఉంచుకుని మిగిలింది ఇవ్వాల్సి ఉంటుంది. వీటిని దశల వారీగా కేంద్రం విడుదల చేస్తుంటుంది. దీని ప్రకారం అన్ని రాష్ట్రాలకు కలిపి లక్షా 78 వేల కోట్లను విడుదల చేస్తోంది. ఇందులో ఏపీకి రూ.7221 కోట్లు పన్నుల వాటాగా ఇవాళ విడుదల చేశారు. అలాగే తెలంగాణకు రూ.3745 కోట్లను పన్నుల వాటాగా విడుదల చేశారు.

 

కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాల్సిన రూ.1,78,173 కోట్ల పన్ను పంపిణీని ఇవాళ విడుదల చేసిందని, ఇందులో అక్టోబరు, 2024లో చెల్లించాల్సిన సాధారణ వాయిదాకు అదనంగా ఒక ముందస్తు వాయిదా రూ.89,086.50 కోట్లు కూడా ఉన్నట్లు ఆర్ధిక మంత్రిత్వశాఖ తెలిపింది. రాబోయే పండుగల సీజన్ దృష్ట్యా, రాష్ట్రాలు మూలధన వ్యయాన్ని వేగవంతం చేయడానికి, వారి అభివృద్ధి/సంక్షేమ సంబంధిత వ్యయాలకు ఆర్థిక సహాయం చేయడానికి ముందస్తు వాయిదాలు విడుదల చేసినట్లు కేంద్రం తెలిపింది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు