Search
Close this search box.

  బలిపశువులను చేశారు.. కొండా సురేఖపై సంచలన ట్వీట్ చేసిన అక్కినేని అఖిల్..

తెలంగాణ మంత్రి కొండా సురేఖ సమంత, నాగచైతన్యల విడాకులకు సంబంధించి చేసిన వ్యాఖ్యల వివాదం తాలూకు దుమారం ఇంకా తెలుగు రాష్ట్రాలలో కొనసాగుతూనే ఉంది. తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని తాను చేసిన వ్యాఖ్యలపై కొండ సురేఖ స్పందించినప్పటికీ, సమంతకు క్షమాపణలు చెప్పినప్పటికీ ఇంకా రాష్ట్రంలో రగడ మాత్రం కొనసాగుతూనే ఉంది.

 

కొండా సురేఖ పై అక్కినేని అఖిల్ సంచలన ట్వీట్

కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా విమర్శలు వ్యక్తం అవుతున్న వేళ నాగార్జున ఆమెపై పరువు నష్టం దావా వేసి ఆమె పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కినేని ఫ్యామిలీ ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటుంది. తాజాగా అక్కినేని అఖిల్ కొండ సురేఖను టార్గెట్ చేసి ఒక సంచలన ట్వీట్ పెట్టారు. ఎలాంటి ఆధారాలు లేకుండా నోటికి వచ్చిన మాటలు మాట్లాడిన కొండా సురేఖ తీరును అఖిల్ తప్పు పట్టారు.

 

కొండా సురేఖ తీరు సిగ్గు చేటు

కొండా సురేఖ చేస్తున్న నిరాధారమైన, హాస్యాస్పదమైన ప్రకటనలు సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా, జుగుప్సాకరంగా, అత్యంత అసభ్యకరంగా ఉన్నాయని ఆయన మండిపడ్డారు. ప్రజాసేవకురాలుగా ప్రజలకు రక్షణ కల్పించడానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన ఆమె తన నైతికతను, సమాజ శ్రేయస్సును మర్చిపోవాలని నిర్ణయించుకుందని అందుకే ఈ తరహా వ్యాఖ్యలు చేసిందని మండిపడ్డారు.

కొండా సురేఖ ప్రవర్తించిన తీరు సిగ్గుచేటు అని నిప్పులు చెరిగారు.

 

ఒక మంచి కుటుంబం అగౌరవంగా మిగిలింది

కొండా సురేఖ క్షమించరాని తప్పు చేసిందని గౌరవంగా బ్రతికే పౌరులు నిజాయితీగా బ్రతికే కుటుంబ సభ్యులు ఆమె కారణంగా గాయపడ్డారని అక్కినేని అఖిల్ అన్నారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల కారణంగా ఒక మంచి కుటుంబ సభ్యులు అగౌరవంగా మిగిలిపోయారని అఖిల్ మండిపడ్డారు.

 

వారిని బలిపశువులను చేసింది

రాజకీయ యుద్ధంలో స్వార్థపూరితంగా గెలవడానికి ప్రయత్నిస్తున్న కొండ సురేఖ ఆమె తన కంటే చాలా ఉన్నతమైన విలువలు మరియు సామాజిక అవగాహన ఉన్న వ్యక్తులపై సిగ్గు లేకుండా దాడి చేసి వారిని బలి పశువులను చేసిందని అక్కినేని అఖిల్ నిప్పులు జరిగారు ఒక కుటుంబ సభ్యుడిగా చిత్ర పరిశ్రమ సభ్యుడిగా నేను మౌనంగా ఉండనన్నారు.

 

ఇటివంటి వారికి సమాజంలో స్థానం లేదు

సిగ్గుమాలిన పని చేసిన ఈ వ్యక్తికి తగిన శిక్ష పడాలని, న్యాయం జరగాలని ఆయన పేర్కొన్నారు. మన సమాజంలో ఇటువంటి వారిని క్షమించరాదని వారికి స్థానం కల్పించకూడదని అక్కినేని అఖిల్ పేర్కొన్నారు .ఇది క్షమించడానికి నేరం, అలానే సహించకూడని నేరమంటూ ఆయన ట్విట్టర్ వేదికగా మరో మారు తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు