Search
Close this search box.

  హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్లో చెరువులు, నాలాలను కబ్జా చేసి, ఎఫ్టీఎల్ పరిధిలోనూ, బఫర్ జోన్స్ లోనూ నిర్మించిన కట్టడాలను గుర్తించి వాటిని కూల్చివేయడం లక్ష్యంగా పెట్టుకొని దూసుకుపోతున్న హైడ్రా వ్యవస్థ పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే మొదట సంపన్నుల ఆక్రమణలను హైడ్రా కూల్చివేస్తున్నట్టు హైడ్రాకు విపరీతమైన మైలేజ్ వచ్చింది.

 

హైడ్రాపై మొదలైన వ్యతిరేఖత

నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో ప్రజల్లోకి ఈ విషయం వెళ్ళింది. అప్పుడు హైడ్రా కూల్చివేతలపైన సర్వత్ర హర్షం వ్యక్తం అయింది. అయితే ఆ తరువాత పరిణామాలలో హైడ్రా సామాన్య మధ్యతరగతి ప్రజల నివాసాలను కూడా కూల్చివేస్తుండడంతో రాష్ట్రవ్యాప్తంగా హైడ్రా పైన వ్యతిరేకత మొదలైంది. పేద మధ్యతరతి వర్గాల వారు హైడ్రా కూల్చివేతలతో కన్నీరు పెట్టుకుంటున్న అనేక వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

 

హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు విచారణ

ముఖ్యంగా ఆపరేషన్ మూసి చేపట్టి మూసి పరివాహక ప్రాంతాలలో ఉన్న ఆక్రమణలను కూల్చివేయాలని నిర్ణయించడంతో మరింత వ్యతిరేకత పెరిగి హైడ్రా వ్యవస్థ పైన ప్రతిపక్ష పార్టీలు కూడా రేవంత్ సర్కార్ను టార్గెట్ చేస్తున్న పరిస్థితి వచ్చింది. అయితే తాజాగా హైడ్రా కూల్చివేతలపై హైకోర్టులో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే ఏ పాల్ ఒక పిటిషన్ దాఖలు చేయగా దానిపైన హైకోర్టు ధర్మాసనం విచారించింది.

 

తేల్చి చెప్పిన హైకోర్టు ధర్మాసనం

ఇప్పటికిప్పుడు హైడ్రా కూల్చివేతలను ఆపలేమని హైకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది. హైడ్రా కూల్చివేతలను తక్షణమే ఆపాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్ నేపథ్యంలో విచారణ జరిపిన హైకోర్టు ఈ విషయాన్ని వెల్లడించింది. జీవో నెంబర్ 99 పై స్టే విధించాలని, కూల్చివేతలను తక్షణమే ఆపేయాలని కేఏ పాల్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు.

 

హైడ్రా కూల్చివేతలపై కోర్టులో విచారణ వాయిదా

అంతే కాదు హైడ్రాకు చట్టబద్ధత కల్పించాలని, అక్రమ కట్టడాల కూల్చివేతలకు నెల రోజుల ముందే నోటీసులు ఇవ్వాలని కూడా ఆయన తన పిటిషన్ లో కోరారు. ఇక పిటీషనర్ తరపు వాదనలు విన్న ధర్మాసనం ప్రతివాదుల కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 14వ తేదీకి వాయిదా వేసింది.

 

అక్టోబర్ 14న మళ్ళీ విచారణ

కోర్టు ఈ కేసులో ప్రతివాదులైన హైడ్రాకు, రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు పంపించింది. దీనిపైన కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ధర్మాసనం సూచించింది. మరి అక్టోబర్ 14న హైడ్రా ఈ కేసు విచారణ జరపనున్న నేపధ్యంలో హైడ్రా, రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ ఏమని దాఖలు చేస్తారో వేచి చూడాలి.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు