Search
Close this search box.

  బెంగళూరులో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పై ఎఫ్ఐఆర్..!!

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పై కేసు నమోదు చేయాలని బెంగళూరు నగరంలోని ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో బెంగళూరు సిటీ పోలీసులు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు మరో కేంద్రమంత్రి జేపీ నడ్డా, కర్ణాటకకు చెందిన పలువురు బీజేపీ నాయకులపై కేసు నమోదు చేయడంతో బీజేపీ కార్యకర్తలు ఉలిక్కిపడ్డారు.

 

శ్రీవారి లడ్డూ, అసలు మ్యాటర్ బయటపెట్టేసిన టీటీడీ ఉద్యోగులు

ఎన్నికల బాండ్ల పేరిట పలువురు పారిశ్రామికవేత్తలను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బెదిరించి బీజేపీకి నిధులు వచ్చేలా చేశారని జనాధికార సంఘర్ష పరిషత్తు (జేఎస్ పీ) నాయకుడు ఆదర్శ్ అయ్యర్ ఆరోపిస్తున్నారు. ఇదే విషయంపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు బీజేపీ నాయకులపై ఫిర్యాదు చేయడానికి బెంగళూరు నగరంలోని తిలక్ నగర్ పోలీస్ స్టేషన్ కి తాను వెళ్లానని ఆదర్శర్ అన్నారు.

 

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు బీజేపీ నాయకుల మీద కేసు నమోదు చెయ్యడానికి తిలక్ నగర్ పోలీసులు నిరాకరించారని ఆదర్శ్ అయ్యర్ ఆరోపించారు. గత ఏడాది ఏప్రిల్ నెలలో ఆదర్శ్ అయ్యర్ బెంగళూరు నగరంలోని 42వ ఏసీఎంఎం కోర్టులో అర్జీ సమర్పించారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు అప్పటి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అప్పటికి బీజేపీ కర్ణాటక శాఖ అధ్యక్షుడు నళిన్ కుమార్ కటేల్, బీవై విజయేంద్ర మీద చర్యలు తీసుకోవాలని జేఎస్ పీ నాయకుడు ఆదర్శ్ అయ్యర్ కోర్టుకు మనవి చేశారు.

 

ఫస్ట్…జగన్ ను దేశ బహిష్కరణ చెయ్యండి, గొట్టిపాటి గట్టి కౌంటర్

కేసు వివరాలు తెలుసుకున్న బెంగళూరు ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తదితరులపై కేసు నమోదు చేయాలని శుక్రవారం బెంగళూరు సిటీలోని తిలక్ నగర్ పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 10వ తేదీకి కేసు విచారణ వాయిదా వేశారు. బెంగళూరు ప్రత్యేక కోర్టు ఆదేశాలతో బెంగళూరు సిటీలోని తిలక్ నగర్ పోలీసులు కేంద్ర మంత్రి శ్రీ నిర్మలా సీతారామన్ తో పాటు బీజేపీ నాయకులపై కేసు నమోదు చేశారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు, కర్ణాటకకు చెందిన బీజేపీ నాయకులు ఎలా స్పందించారో వేచి చూడాలని కర్ణాటక ప్రజలు అంటున్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు