ఆర్ఆర్ఆర్ సినిమాతో బెస్ట్ ఫ్రెండ్స్ గా మారిపోయారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. వీరిద్దరిని ఆ సమయంలో చూసిన వారందరూ.. ఫ్రెండ్స్ అంటే .. కాదు కాదు అన్నదమ్ములంటే ఇలా ఉండాలి అనుకున్నారు అంటే అతిశయోక్తి లేదు. అంతలా వీరిమధ్య బాండింగ్ కనిపించింది.
ఇక సినిమా రిలీజ్ అయ్యాకా .. ఒకరి పాత్ర ఎక్కువ .. ఒకరి పాత్ర తక్కువ ఉందని ఫ్యాన్ వార్స్ జరిగాయి. దానివలన వీరిద్దరి మధ్య మాటలు తగ్గాయని వార్తలు కూడా వచ్చాయి. కానీ, అలాంటివాటి గురించి ఆర్ఆర్ఆర్ .. రామ్ చరణ్, రామారావు, రాజమౌళి ఎప్పుడు మాట్లాడింది లేదు. షూటింగ్స్ వలన బిజీగా ఉండడంతో ఒకరినొకరు పలకరించుకోకపోయినా.. ఒకరి శ్రేయస్సును మరొకరు కోరుకుంటూనే ఉంటారు.
తాజాగా రామ్ చరణ్.. తారక్ కొత్త సినిమా రిలీజ్ వేళ.. బెస్ట్ విషెస్ తెలుపుతూ ట్వీట్ చేయడం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రేపు అనగా సెప్టెంబర్ 27 న రిలీజ్ కు రెడీ అవుతుంది.
ఇక ఈ నేపథ్యంలోనే చరణ్.. ” రేపు దేవర సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా నా సోదరుడు తారక్ కు , చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.
ఇక చరణ్ పోస్ట్ తో మెగా ఫ్యాన్స్ కూడా దేవర సినిమాపై మొగ్గు చూపిస్తారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇంకోపక్క ఎన్టీఆర్ ఫ్యాన్స్ సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చరణ్ కు థాంక్స్ చెప్తూ కామెంట్స్ పెడుతున్నారు. మరి దేవర సినిమాతో ఎన్టీఆర్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.