Search
Close this search box.

  వాళ్ళను ఎవర్నీ వదిలిపెట్టను.. తొలిసారి స్పందించిన జానీ మాస్టర్.

తన వద్ద అసిస్టెంట్ గా పని చేసిన కొరియోగ్రాఫర్ పైన ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అత్యాచారం చేశారన్న వ్యవహారం చిలికి చిలికి గాలివానగా మారిన విషయం తెలిసిందే. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసు పైన రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది రాజకీయ ప్రముఖులు, సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు తమ స్పందన తెలియజేస్తున్నారు.

 

జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసులో లవ్ జీహాద్

జానీ మాస్టర్ ముస్లిం కావడంతో యువతి పైన లైంగిక వేధింపులకు పాల్పడి ఆమెను మతం మార్చుకోవాలని ఒత్తిడి తెచ్చారన్న ఆరోపణల పైన లవ్ జిహాద్ లో భాగంగానే ఇది జరిగిందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తూ జానీ మాస్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా హిందూ సంఘాలు దీనిపైన తీవ్రంగా విరుచుకుపడుతున్నారు.

 

కడిగిన ముత్యంలా బయటకు వస్తానన్న జానీ మాస్టర్

ఈరోజు నార్సింగి పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. ఈ క్రమంలో కోర్టు ఆవరణలో జానీ మాస్టర్ మీడియాతో మాట్లాడుతూ కావాలనే తలను కుట్రపూరితంగా ఈ కేసులో ఇరికించారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను కడిగిన ముత్యంలా నిజాయితీగా బయటకు వస్తానని ధీమా వ్యక్తం చేశారు. తనను టార్గెట్ చేసి ఇబ్బందులకు గురిచేసిన ఎవరిని వదిలిపెట్టేది లేదని అందరికీ వడ్డీతో సహా చెల్లిస్తానని జానీ మాస్టర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

 

తను ఎవరిని లైంగికంగా వేధించలేదన్న జానీ మాస్టర్

తనను కావాలని ఈ కేసులో ఇరికించారని, తను ఎవరిని లైంగికంగా వేధించలేదని, ఆ అమ్మాయితో తన పైన కావాలని కొందరు తప్పుడు కేసు పెట్టించారని, న్యాయపోరాటం చేసి బయటకు వస్తానని వ్యాఖ్యలు చేశారు. ఇక నిన్నటికి నిన్న జానీ మాస్టర్ సతీమణి ఆయేషా కూడా తన భర్త చాలా మంచివాడని తన అతనిపైన వచ్చినవన్నీ తప్పుడు ఆరోపణలని జానీ మాస్టర్ కేసు విషయంలో స్పందించారు.

 

జానీ మాస్టర్ ను ఇండస్ట్రీలో ఎదగకుండా కుట్ర చేస్తున్నారన్న ఆయన భార్య

ఇటీవల నేషనల్ అవార్డు తీసుకున్న తన భర్తను ఇండస్ట్రీలో ఎదగకుండా చేసే కుట్రలో భాగంగా ఇలా తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. ఒకవేళ తన భర్త నిజంగానే తప్పు చేశాడని, ఎవరినైనా లైంగికంగా వేధించాడని నిరూపిస్తే తాను తన భర్తను వదిలేస్తానని కూడా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. కావాలని జానీ మాస్టర్ ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఆమె మీడియా పైన అసహనం వ్యక్తం చేశారు.

 

జానీ మాస్టర్ కేసులో ఏం జరుగుతుందో

ఇదిలా ఉంటే నేడు జానీ మాస్టర్ ను కోర్టులో పోలీసులు హాజరు పరచగా కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పు నిచ్చింది. దీంతో ఆయనను చంచల్ గూడా జైలుకు తరలిస్తున్నారు పోలీసులు. మరి ఈ కేసులో పోలీసులు ముందు ముందు ఏం చెయ్యబోతున్నారు అన్నది తెలియాల్సి ఉంది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు