తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం నేపథ్యంలో వైసీపీ నేతలపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా, తిరుపతిలో జనసేన పార్టీ శ్రేణులు జగన్ తదితర వైసీపీ ముఖ్య నేతల దిష్టిబొమ్మలను దగ్ధం చేశాయి.
జనసేన నేతలు, కార్యకర్తలు వైసీపీ నేతల దిష్టిబొమ్మలను చెప్పులతో కొడుతూ ఊరేగింపు చేపట్టారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసివారిని అరెస్ట్ చేయాలని నినాదాలు చేశారు.
కల్తీ జరిగిందని ఎన్డీడీబీ రిపోర్ట్ చెబుతున్నా జగన్ బుకాయిస్తున్నారని, ప్రజలకు జగన్ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. గోవింద నామస్మరణ చేస్తూ దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు.