Search
Close this search box.

  ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట..

ఓటుకు నోటు కేసును మరో రాష్ట్రానికి చెందిన హైకోర్టుకు బదిలీ చేయాలని దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. ఈ కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భారీ ఊరట లభించింది. ఈ కేసు విచారణను రేవంత్ రెడ్డి ప్రభావితం చేస్తారనే దానిపై ఆరోపణలు తప్ప ఆధారాలు లేవన్న సుప్రీంకోర్టు.. ఈ దశలో జగదీశ్ రెడ్డి పిటిషన్ ను ఎంటర్ టైన్ చేయలేమని తేల్చి చెప్పింది. కేసు విచారణలో సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకోవద్దని ఆదేశించింది. అలాగే ఈ కేసుకు సంబంధించిన వివరాలను రేవంత్ కు రిపోర్ట్ చేయవద్దని సుప్రీం ధర్మాసనం ఏసీబీకి కూడా ఆదేశాలు జారీ చేసింది.

 

ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి పర్యవేక్షణకు కూడా నిరాకరించిన ధర్మాసనం.. మున్ముందు సీఎం రేవంత్ రెడ్డి కేసులో జోక్యం చేసుకుంటే పిటిషనర్ మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని వెల్లడించింది.

 

ఆగస్టు నెలలోనూ కేసు ట్రయల్ బదిలీ చేయాలని బీఆర్ఎస్ నేత జగదీశ్వర్ రెడ్డి పిటిషన్ వేయగా.. న్యాయస్థానం దానిని కొట్టివేసింది. కేసు విచారణను తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్ కు బదిలీ చేయడం కుదరదని, కేవలం అపోహలతో విచారణ బదిలీ చేస్తే.. న్యాయవ్యవస్థపై నమ్మకం లేనట్టే అవుతుందని వ్యాఖ్యానించింది.

 

2015లో తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు టీడీపీ అభ్యర్థికి ఓటు వేసేలా ఓటర్లకు డబ్బు పంచాలని ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు డబ్బు అప్పగించినట్లు వార్తలొచ్చాయి. ఆ తర్వాత చంద్రబాబు – స్టీఫెన్ ల మధ్య జరిగిన ఫోన్ సంభాషణ, చంద్రబాబు- రేవంత్ భేటీలో డబ్బు అప్పజెప్పిన వీడియో ఫుటేజీ బయటికి రావడంతో.. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి. ఇందులో రేవంత్ రెడ్డి హస్తం కూడా ఉందని బీఆర్ఎస్ నేత జగదీశ్వర్ రెడ్డి సుప్రీంను ఆశ్రయించడంతో.. కేసు విచారణపై ఉత్కంఠ పెరిగింది. వరుస వాయిదాల తర్వాత రేవంత్ కు ఊరట లభించింది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు