తెలంగాణలో చాలా మంది రైతులు రుణ మాఫీ కాలేకపోవడంతో చాలా మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వారు బ్యాంకులు, వ్యవసాయ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. రుణ మాఫీ కాని రైతుల కోసం ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కదన రంగంలో దూకనుంది. రుణమాఫీ చేయాలనే డిమాండ్‌తో బీఆర్ఎస్ గురువారం చలో ప్రజాభవన్ కు పిలుపునిచ్చింది. ఇందకు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
రుణ మాఫీ మాట నిలబెట్టుకోవాలని రైతులు చలో ప్రజాభవన్‌కు పిలుపునిచ్చినందుకు రైతులను అరెస్ట్ చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం రాత్రి నుంచి రైతులను, రైతు సంఘాల నాయకులను అక్రమంగా అరెస్టు చేస్తున్నట్లు సమాచారం అందుతుందని చెప్పారు. అప్రజాస్వామిక చర్యలను ప్రభుత్వం మానుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు బీఆర్ఎస్ శ్రేణులు, రైతులు అన్ని జిల్లాల్లో రైతులు బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయ ఎదుట తమకు రుణమాఫీ చేయాలని నిరసనలకు దిగారు.
ప్రభుత్వం కొంత మందికి రుణ మాఫీ చేసి అందరికి రుణ మాఫీ చేసినట్లు చెప్పుకుంటుందని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ముఖ్యమంత్రికి రైతులంటే ఇంత భయం ఎందుకని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ రైతులను ప్రభుత్వం మోసం చేసిందన్నారు. రైతులు కాంగ్రెస్ ఇచ్చిన హామీ అమలు చేయాలని డిమాండ్ చేస్తే అరెస్ట్ చేస్తారా అని నిలదీశారు. రైతుల ఉద్యమం ఇంతటితో ఆగదని అన్నారు. రుణ మాఫీ చేసే వరకు ప్రభుత్వాన్ని వదిలే ప్రసక్తి లేదన్నారు.
అన్నదాతల పోరటానికి కాంగ్రెస్ ప్రభుత్వం దిగ రాక తప్పదని చెప్పారు. తమకు రుణ మాఫీ కాలేదని లక్షలాది మంది రైతులు తమకు ఫిర్యాదు చేశారు. రుణ మాఫీ కాని రైతులకు డబ్బులు జమ చేస్తామని ప్రభుత్వం చెబుతున్నా.. ఆ దిశగా ఎలాంటి చర్యలు కనిపించడం లేదని రైతు సంఘాలు చెబుతున్నాయి. ఎప్పుడు రుణ మాఫీ చేస్తారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే రైతుల శక్తి ఏమిటో చూపిస్తామని అన్నారు.