- వరదల్లో నష్టపోయిన పంటకు హెక్టారుకు 5 వేలు నష్టపరిహారం అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఏలేరు ముంపు బాధితులను పరామర్శించిన ఆయన రాజుపాలెంలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. పాడైపోయిన వాహనాలకు రూ.10 వేలు చొప్పన, వరదలో తీవ్రంగా దెబ్బతిన్న గృహాల స్థానంలో కొత్త గృహాలను నిర్మిస్తామన్నారు. ఈనెల 17లోగా బాధితులకు నష్టపరిహారం అందిస్తామన్నారు.
