కాకినాడ జిల్లా పిఠాపురం పెద్ద బజారు వీధిలో పురాతన భవనం కూలింది.ఆదివారం కావడంతో దుకాణాలుమూసి ఉండటంతో ప్రమాదం తప్పింది.నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో శిథిలావస్థకు చేరిన పురా తన భవనాలు తొలగించకుండా వదిలేసారు. వీటి తొలగింపు పై మున్సి పల్ అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపణలు ఉన్నాయి.వర్షాలు, తుఫానులు వచ్చినప్పుడు ఇవి భయాందోళన కలిగిస్తున్నాయి.
