అమరావతిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యాలయంలో మినీ మినియేచర్ శిల్పాలు ఏర్పాటు చేస్తున్నారు. శాస్త్ర సాంకేతిక విభాగంలోకి వచ్చే పలు అంశాలతో కూడిన బొమ్మలు ప్రత్యేకంగా తయారు చేయించారు. అంతరిక్ష ప్రస్థానం, లోహాలతో కూడిన శిల్పాలను బెంగళూరుకు చెందిన క్రాఫ్ట్ సంస్థ సహకారంతో ఏర్పాటు చేశారు. తన శాఖలకు సంబంధించి అంశాలను గోడ చిత్రాల రూపంలో, కొయ్య శిల్పాలతో అలంకరించాలని పవన్ అధికారులు సూచించారు
