78వ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకొని దేశ ప్రజలందరికీ ఏపీడిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు.”మన దేశం స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు పొందటానికి జీవితాలు, ప్రాణాలు ధారపోసిన మహానుభావులందరినీ మనస్ఫూర్తిగా స్మరించుకోవాలి. వారి త్యాగాల పునాదులపైనే మన దేశ నిర్మాణం సాగింది”. అని పవన్ ప్రజలనుద్దేశించి ప్రకటన విడుదల చేశారు
