Search
Close this search box.

  ముంబైకి మకాం మార్చిన హైబ్రిడ్ పిల్ల సాయి పల్లవి..!

టాలీవుడ్ హీరోయిన్ సాయిపల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే తన యాక్టింగ్, డ్యాన్స్‌తో కుర్రకారుకి నిద్రలేకుండా చేస్తోంది. అంతలా తన అందంతో టాలీవుడ్‌లో తిరుగులేని ఫ్యాన్స్‌ని సంపాదించుకుంది. అంతేకాదు తన మూవీస్ ఎంపికలో ఎన్నో హిట్‌లను తన ఖాతాలో వేసుకుంది. తాజాగా బాన్సువాడ భానుమతి హైబ్రిడ్ పిల్ల అంటూ ఆడియెన్స్‌ని ఎంతగానో ఫిదా చేసింది ఈ మళయాలీ ముద్దుగుమ్మ.

ఈ అమ్మడు ఇప్పుడు ముంబైలో ఉంది. అదేంటి అక్కడ ఏం పని ఆమెకు అనుకుంటున్నారా.. అవును అక్కడే ఆమెకు పని ఉంది. ఈ విషయాన్ని స్వయానా తన సోషల్ మీడియాలో వివరాలను పొందుపరిచింది. నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న రామాయణం సినిమాలో సీత రోల్ చేయనుంది. ఈ రోల్‌లో సాయి పల్లవి యాక్ట్ చేస్తున్న నేపథ్యంలో ముంబై అనగానే ఆ మూవీనే అందరూ గుర్తు చేసుకుంటున్నారు. కానీ సాయిపల్లవి ముంబైలో ఉన్నది రామాయణం మూవీ కోసం కాదంట. తమిళ సినిమా అమరన్ డబ్బింగ్ వర్క్ కోసం ముంబై వెళ్లినట్టు సాయిపల్లవి చెప్పుకొచ్చింది.

రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వంలో భారీ అంచనాల నడుమ రూపొందుతున్న మూవీ అమరన్‌లో హీరోగా శివ కార్తికేయన్ యాక్ట్ చేస్తుండగా, హీరోయిన్ గా సాయి పల్లవి యాక్ట్ చేయబోతోంది. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయింది. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు నడుస్తున్నాయి. ఈ మూవీని అక్టోబర్ ఎండింగ్‌కల్లా భారీ ఎత్తున రిలీజ్‌ చేయాలని నిర్ణయించారు మూవీ యూనిట్. ఆగష్టు చివరి వరకు లేదా సెప్టెంబర్‌ నెలాకరుకల్లా మూవీ మొదటి కాపీ రెడీ అయ్యే ఛాన్సులు గట్టిగానే ట్రై చేస్తున్నారట ఈ మూవీ యూనిట్.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు