Search
Close this search box.

  వివాదంలో సుమ..! బోర్డు తిప్పేసిన రాకీ అవెన్యూస్‌..

ఫేజ్ వన్ ఫ్లాట్లన్నీ అమ్ముడుపోయాయి. ఇప్పుడు 18 లక్షలకే సెకండ్ ఫేజ్ లో ఫ్లాట్. త్వరపడండి ఉగాది సందర్భంగా కంపెనీయే రిజిస్ట్రేషన్ ఫీజు భరిస్తుంది. పైగా జీఎస్టీ కూడా కట్టనవసరం లేదు. ఇది ప్రముఖ టీవీ యాంకర్ సుమ కనకాల.. రాకీ అవెన్యూస్ కు ప్రచారం చేస్తూ చెప్పిన మాటలివి. రాజమండ్రిలో రాకీ అవెన్యూస్‌ బోర్డు తిప్పేయడంతో.. వందలాది మధ్యతరగతి కుటుంబాలు రోడ్డున పడ్డాయి.

ఫేజ్ వన్ ప్రాజెక్టు యాడ్స్ లో అయితే సుమతో పాటు రాజీవ్ కనకాల కూడా నటించారు. ఆ తర్వాత ఫేజ్ టులో సుమతో పాటు ఇతర నటీనటులు రాకీ అవెన్యూస్ కు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నారు. చవకగా ఇళ్లంటూ ఊదరగొట్టారు. సుమ మధ్యతరగతి కుటుంబాల్లో ఫ్యాన్ బేస్ చాలానే ఉంది. అందుకే సుమ చెప్పిందంటూ రాకీ అవెన్యూస్‌లో జనం భారీగా ఫ్లాట్లు కొన్నారు. తీరా ఇప్పుడు.. ఫ్లాట్లు అప్పగించకుండానే ఆ సంస్థ ప్యాకప్ చెప్పింది. దాంతో తమకు న్యాయం చేయాలంటూ బాధితులు రోడ్డెక్కారు.

ఫ్లాట్లు కొనుక్కొండి.. త్వరపడండి అంటూ అడ్వర్టైజ్మెంట్ చేసిన సుమ ఇప్పుడు బాధితులు రోడ్డెక్కితే అడ్రస్ లేరు. బాధితుల విషయంలో సుమ ఎందుకు స్పందించలేదు. ఫ్లాట్లు కొనాలంటూ చెప్పిన సుమకు, కస్టమర్లకు అండగా నిలవాల్సిన బాధ్యత లేదా..? కేవలం రెమ్యునరేషన్ తీసుకుంటే చాలా..? జనం నిండా మునిగినా పర్వాలేదా..? అనే ప్రశ్నలను సుమ సమాధానం చెప్పాలంటున్నారు పబ్లిక్.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు