Search
Close this search box.

  పొట్టి డ్రెస్‌లో మాజీ మంత్రి రోజా..!

వైసీపీ ఫైర్ బ్రాండ్ , మాజీ మంత్రి రోజా మరోసారి వార్తల్లో నిలిచారు. రాష్ట్ర రాజకీయాల్లో రోజాకు ప్రత్యేక స్థానం ఉంది. మాటల తూటాలు పేల్చి ప్రత్యర్థి పార్టీలను ఇరుకున పెట్టడంలో రోజా స్పెషలిస్ట్. నిత్యం వార్తల్లో రోజా పేరు లేకుండా ఉండదు. పవిత్ర పుణ్యక్షేత్రం అయినా అసెంబ్లీ హాల్ లో అయినా ఆమె మాట్లాడే మాట తూటాలుగా పేలడం ఖాయం. అక్కడున్నది చంద్రబాబు, పవన్ కల్యాణ్ అయినా సరే రోజా విమర్శలకు బలి కావాల్సిందే.

ఇంకా చెప్పాలంటే రోజా విమర్శించినంత దారుణంగా పవన్ కల్యాణ్‌ను మరే రాజకీయ నాయకుడు కూడా విమర్శించలేదంటే అతిశేయోక్తి కాదనిపిస్తోంది. 2014, 2019 వరుస ఎన్నికల్లో నగరి నుంచి విజయం సాధించారామె. గత వైసీపీ ప్రభుత్వంలో టూరిజం శాఖమంత్రిగా కూడా ఆమె పని చేశారు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో రోజా దారుణ ఓటమిని చవి చూశారు. సొంత పార్టీ నేతలే తనకు వ్యతిరేకంగా పని చేశారని ఆమె ఆరోపించారు.

 

పార్టీ కూడా ఓడిపోవడంతో రోజా సైలెంట్ అయ్యారు. ఒకనొక సమయంలో రోజా వైసీపీని వీడి బీజేపీలో చేరుతున్నారనే వార్తలు వినిపించాయి. అయితే వైసీపీలోనే ఉంటూ తన వాయిస్‌ను వినిపిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా రోజా చేసిన ఓ పని ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నికల్లో ఓడిపోవడంతో రోజా ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్లారు. ఆమె ప్రస్తుతం ఇటలీ వెకేషన్‌కు వెళ్లి అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు.అయితే విదేశాల్లో ఉన్న రోజా పొట్టి డ్రెస్‌లో కనిపించి అందరికీ షాకిచ్చారు.రోజా కేవలం స్కర్ట్ మాత్రమే ధరించారు.

క్రింద ఫ్యాంట్ ఏమీ లేకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గతంలో రోజా చీర అందం అంటూ చాలా విషయాలు చెప్పుకొచ్చారు. అలాంటిది ఇప్పుడు ఆమె పొట్టి డ్రెస్‌లో కనిపించే సరికి రోజాను దారుణంగా ఆమె ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. ప్రస్తుతం రోజా మినీ డ్రెస్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు