Search
Close this search box.

  ఆగస్టు 15న ఏపీలో 100 అన్న క్యాంటీన్ల ప్రారంభం..

ఏపీలో గత ప్రభుత్వం మూసివేసిన అన్న క్యాంటీన్లను తిరిగి తెరిచేందుకు కూటమి ప్రభుత్వం ముమ్మరంగా కృషి చేస్తోంది. ఈ క్రమంలో ఆగస్టు 15న 100 అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తున్నామని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ వెల్లడించారు.

రాష్ట్రంలోని 33 మున్సిపాలిటీల్లో ఈ 100 అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేశామని, ఇక్కడ రూ.5 కే భోజనం లభిస్తుందని తెలిపారు. వచ్చే వారం రోజుల పాటు అన్న క్యాంటీన్లపై దృష్టి సారించాలని పురపాలక శాఖ కమిషనర్ కు సూచించారు.

ఇటీవల ఎన్నికల్లో గెలిచిన అనంతరం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక చంద్రబాబు సంతకాలు చేసిన ఫైళ్లలో అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ ఫైలు కూడా ఉంది.

రాష్ట్ర విభజన జరిగాక… అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం 2014 నుంచి 2109 మధ్య కాలంలో 204 అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసింది. అయితే, వైసీపీ 2019లోకి అధికారంలోకి వచ్చాక మొత్తం 204 అన్న క్యాంటీన్లను మూసివేశారు.

తాము అధికారంలోకి వస్తే మళ్లీ అన్న క్యాంటీన్లను తెరుస్తామని చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో ప్రతి చోట చెప్పారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు