Search
Close this search box.

  ఫోన్‌లో అశ్లీల వీడియోలు చూసి 9 ఏళ్ల చెల్లెలిపై 13 ఏళ్ల అన్న అఘాయిత్యం.. ఆపై హత్య..

మొబైల్ ఫోన్‌లో అశ్లీల వీడియోలు చూసిన 13 ఏళ్ల బాలుడు ఆపై తన పక్కనే నిద్రిస్తున్న 9 ఏళ్ల సోదరిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తండ్రికి చెబుతానని ఆమె బెదిరించడంతో గొంతు నులిమి చంపేశాడు. దీనికి అతడి తల్లి, ఇద్దరు అక్కలు సహకరించడం గమనార్హం. మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో ఏప్రిల్ 24న ఈ ఘటన జరిగింది. విచారణలో ఈ దారుణ విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో నిందితుడు, అతడి తల్లి, 17, 18 ఏళ్ల వయసున్న నిందితుడి అక్కలను పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు.

పోలీసుల కథనం ప్రకారం.. ఘటన జరిగిన రోజు రాత్రి బాలిక నిద్రిస్తుండగా, మొబైల్‌లో పోర్న్‌ వీడియోలు చూసిన నిందితుడు చెల్లెలిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. భయపడిపోయిన బాలిక ఈ విషయాన్ని తండ్రికి చెబుతానని బెదిరించడంతో ఆమె గొంతు నులిమి చంపేశాడు.

ఆ తర్వాత తల్లిని లేపి విషయం చెప్పాడు. ఆమె లేచి కుమార్తెను చూసింది. అప్పటికీ ఇంకా ఆమె ఊపిరి తీసుకుంటుండడంతో బాలుడు మరోమారు ఆమె గొంతు నులిమి చంపేశాడు. ఈ గొడవతో నిద్రలేచిన నిందితుడి అక్కలు ఇద్దరు బెడ్‌పై ఉన్న మరకలను తొలగించారు. బాలిక మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. దీంతో అతడితోపాటు సహకరించిన తల్లి, ఇద్దరు అక్కలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు