కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో గొల్లప్రోలు లో వేమగిరి సురేష్ అనే వ్యక్తి నేకూరి రాజ్యలక్ష్మి (42) అనే మహిళపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో రాజ్యలక్ష్మి తల, నడుము ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అనంతరం కాకినాడ పంపించారు. పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, పిఠాపురం ఎస్ఐ మురళీమోహన్ ఆస్పత్రిలో గాయపడ్డ మహిళ నుండి ప్రాథమిక వివరాలు తీసుకున్నారు. ఇంటి సరిహద్దు గోడకు సంబంధించి వివాదం తలెత్తునట్లుగా తెలుస్తోంది.
