మహిళల అంతర్జాతీయ టీ20 ప్రపంచకప్‌కు సంబంధించి ఐసీసీ కీలక ప్రకటన చేసింది. ప్రపంచకప్ పరిధిని పెంచాలని నిర్ణయించింది. దీంతో రాబోయే టోర్నమెంట్లలో టీమ్స్ సంఖ్య 16కి పెరుగుతుంది. టీ-20 క్రికెట్‌కు పెరుగుతున్న ఆదరణ, కొత్త దేశాల జట్ల ప్రదర్శన మెరుగుపడుతుండడంతో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. జూన్‌లో జరిగిన పురుషుల టీ20 ప్రపంచకప్‌లో మొత్తం 20 జట్లు పాల్గొన్నాయి. చరిత్రలో తొలిసారిగా ఇన్ని జట్లు టోర్నీలో భాగస్వామ్యమయ్యాయి.
