టిటిడి దేవస్థానం శ్రీవారి దర్శనానికి సంబంధించి అక్టోబర్ కోటాను విడుదల చేయనుంది. మంగళవారం ఉదయం 10 గంటలకు టిటిడి సైట్లో టిక్కెట్లను అందుబాటులో ఉంచనుంది. ఉదయం 10 గంటలకు అంగప్రదక్షణ టోకెన్లు, 11 గంలకు శ్రీవాణి దర్శన టిక్కెట్లను విడుదల చేస్తారు. మధ్యాహ్నాం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగుల కోటా విడుదలవుతుంది. రేపు(బుధవారం)రూ.300 ప్రత్యేక దర్శన టిక్కెట్లను విడుదల చేయనున్నారు .https://ttdevasthanams.ap.gov.in/