రాజంపేట పరిధిలోని కావలిపల్లి రాయవరం సెక్షన్ వద్ద 7 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని, ముగ్గురు స్మగ్లర్లను టాస్క్ ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రెండు మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
టాస్క్ ఫోర్సు ఇన్చార్జి, తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాలతో, టాస్క్ ఫోర్స్ ఎస్పీ పీ.శ్రీనివాస్ అధ్వర్యంలో డీఎస్పీ చెంచుబాబు, ఆర్ఐ సురేష్ కుమార్ రెడ్డి కి చెందిన ఆర్ఎస్ఐ కే.సురేష్ బాబుకు చెందిన టీమ్ స్మగ్లర్లను అరెస్టు చేసింది.