రాక్ సిరామిక్స్‌లో తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని జరుగుతున్న ఆందోళన వర్షంలో సైతం కొనసాగింది. 24 మంది కార్మికులతో పాటు మరో 40 మంది ఆంధ్రా కార్మికులను తొలగించడానికి రాక్ యాజమాన్యం రంగం సిద్దం చేసిందని, దీనిని నిలువరించాలంటే కార్మికులందరూ టోకెన్ సమ్మెకు సిద్దపడాలని సిఐటియు జిల్లా కార్యదర్శి డి. క్రాంతి కుమార్ పిలుపునిచ్చారు.
