పిఠాపురం మున్సిపాలిటీలో నిబంధనలకు విరుద్ధంగా ఏడుగురు ఉద్యోగులను ఆప్కోస్ విధానంలో నియమించి, అక్రమాలకు పాల్పడ్డ అధికారులపై చర్యలు తీసుకోవాలని పిఠాపురం మున్సిపల్ కౌన్సిలర్లు కలెక్టర్ ను కోరారు. మున్సిపాలిటీలో పనిచేసి మృతిచెందిన వారి పోస్టులను మృతుల కుటుంబ సభ్యులకు ఇవ్వకుండా అమ్ముకున్నారని కౌన్సిలర్లు ఆరోపించారు.









