బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనల్లో 150 మంది చనిపోయారు. దాదాపు 2,500 మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో తాజాగా రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. రిజర్వేషన్ల కోటాను రద్దు చేస్తూ.. విద్యార్థులు తిరిగి చదువులోకి వెళ్లాలని బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు ఆదివారం తెలిపింది. కాగా, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లను సంస్కరించాలని బంగ్లాదేశ్‌లో విద్యార్థులు నిరసనలు చేస్తున్నారు.
