కేరళ రాష్ట్రంలో వ్యాపిస్తున్న నిఫా వైరస్‌పై కేంద్రం అప్రమత్తమైంది. కేంద్రానికి ప్రత్యేక వైద్య బృందాలను పంపించింది. నిఫా వైరస్‌తో కేరళలో మల్లప్పురానికి చెందిన 14 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. దీంతో ఆ బాలుడి కాంటాక్ట్ శాంపిల్స్‌ను సేకరిస్తున్నారు. శాంపిల్స్ ను కోజికోడ్‌కు బీఎస్ఎల్-3 మొబైల్ ల్యాబ్‌కు పంపించారు.నిఫా మరణాల కలకలంతో క్వారంటైన్ చర్యలకు కేంద్రం ఉపక్రమించింది.
