సోమవారం నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలకు పసుపు రంగు దుస్తులు, సైకిల్ గుర్తు కండువాలతో హాజరుకావాలని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు టీడీఎల్పీ సూచించింది. తొలుత వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి అసెంబ్లీకి వెళ్లాలని పేర్కొంది.
22 నుండి ఐదు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.
మొదట ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు.
