పిఠాపురం పట్టణం మెయిన్ రోడ్ లో గల సాయిబాబా గుడిలో గురు పౌర్ణమి సందర్భంగా బాబా వారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. ప్రత్యేక అలంకరణ లో సాయిబాబా భక్తులకు దర్శనమిచ్చారు. ప్రసిద్ధి సాయిబాబా ఆలయం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం ప్రసాద వితరణ జరిగింది.
